నిబంధనలు ఉల్లంఘించిన రొమేనియా ప్రధాని.. రూ.52వేల జరిమానా!

ABN , First Publish Date - 2020-06-01T02:20:57+05:30 IST

కొందరు ప్రజాప్రతినిధులు.. నిబంధనలు ప్రజలకే కానీ తమకు వర్తించవని యథేచ్చగా వాటిని ఉల్లంఘిస్తుంటారు. రొమేనియా ప్రధాని లుడోవిక్ ఒర్బన్ కూడా ఈ కోవకే చెం

నిబంధనలు ఉల్లంఘించిన రొమేనియా ప్రధాని.. రూ.52వేల జరిమానా!

న్యూఢిల్లీ: కొందరు ప్రజాప్రతినిధులు.. నిబంధనలు ప్రజలకే కానీ తమకు వర్తించవని యథేచ్చగా వాటిని ఉల్లంఘిస్తుంటారు. రొమేనియా ప్రధాని లుడోవిక్ ఒర్బన్ కూడా ఈ కోవకే చెందుతారు. కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన నిబంధనలు ఉల్లఘించారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో తప్పు ఒప్పుకుని దాదాపు రూ. 52వేల జరిమానా కట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రొమేనియా ప్రధాని లుడోవిక్ ఒర్బన్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. ప్రధాని లుకోవిడ్ ఒర్బన్.. కొంత మంది వ్యక్తులతో కలిసి పార్టీ చేసుకున్నారు. సిగరేట్ తాగుతూ, మద్యం సేవించారు. ప్రధాని లుడోవిక్ ఒర్బన్ సహా ఆ పార్టీలో పాల్గొన్న ఏ ఒక్కరూ మాస్కు ధరించలేదు. లుకోవిడ్ ఒర్బన్ పాల్గొన్న పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేయడంతో.. ఆయన స్పందించారు. మే 25న తన 57వ పుట్టిన రోజు సందర్భంగా కేబినెట్‌లోని మంత్రులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు వివరించారు. అయితే మాస్కు ధరించకపోవడం తప్పే అని ఒప్పుకున్న ఆయన.. దాదాపు రూ. 52వేల జరిమానా చెల్లించారు. 


Updated Date - 2020-06-01T02:20:57+05:30 IST