ఫిజికల్ సైన్స్ ప్రిఫైనల్ మళ్ళీ వద్దు

ABN , First Publish Date - 2020-02-25T07:56:41+05:30 IST

పదవ తరగతి పిల్లలకు పరీక్షల ఒత్తిడి మామూలుగానే ఎక్కువ ఉంటుంది.

ఫిజికల్ సైన్స్ ప్రిఫైనల్ మళ్ళీ వద్దు

పదవ తరగతి పిల్లలకు పరీక్షల ఒత్తిడి మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇది చాలదన్నట్టు హైదరాబాదు జిల్లాలలో ఇటీవల (19.02.2020న) జరిగిన ఫిజికల్ సైన్స్ ప్రిఫైనల్ పరీక్షను మరలా నిర్వహించాలని తలపెట్టారు. నా మనవడు ఆ రోజున ప్రిఫైనల్ పరీక్షను రాసిన వెంటనే ఆ స్కూలుకు జిల్లా విద్యా శాఖాధికారి, హైదరాబాద్ నుంచి "due to discrepancy prefinal (Physical Science Exam) will be conducted again on 28.02.2020" అని సందేశం వచ్చింది. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో మానసికంగా అలసిపోతున్నారు. ఈ ప్రిఫైనల్ పరీక్షను మరలా నిర్వహిస్తారన్న వార్తతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. ఎందుకంటే అది చాలా కఠినమైన పరీక్ష. ఈ discrepancy ఎందుకు వచ్చిందో డీయీవో గారు శాఖాపరమైన విచారణ నిర్వహించి అందుకు తగిన చర్య తీసుకోవాలి. ప్రీఫైనల్ పరీక్షలు కేవలం సన్నాహక పరీక్షలు మాత్రమే. వాటిని మరలా నిర్వహించటం విద్యార్థులపైన, వారి తల్లిదండ్రులపైన అనవసరమైన ఒత్తిడి తప్ప మరేమీ కాదు. తెలంగాణలోని మిగిలిన జిల్లాలలో ఈ విధంగా ఈ పరీక్ష మరలా నిర్వహించకపోవటం గమనార్హం. హైదరాబాద్ విద్యార్థులే ఈ ఇబ్బందికి గురవ్వాల్సి వస్తోంది. కాబట్టి, దయచేసి ఈ పరీక్షను మరలా నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి.

నాగశేషు, హైదరాబాద్

Updated Date - 2020-02-25T07:56:41+05:30 IST