లైంగిక వేధింపుల ఆరోపణలు.. డీపీఓపై వేటు..

ABN , First Publish Date - 2020-07-01T03:31:03+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డీపీఓ శ్రీనివాస్ సహ ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నట్లు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. డీపీఓపై వేటు..

పశ్చిమగోదావరి: జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. డీపీఓ శ్రీనివాస్ సహ ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై బాధిత ఉద్యోగినులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఎస్పీ విచారణ జరిపారు. ఆరోపణలు నిజమేనని విచారణలో తేలడంతో.. ఎస్పీ నివేదిక ఆధారంగా డీపీఓను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఓ శ్రీనివాస్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కలెక్టర్ కోరారు. కాగా, ఇన్‌చార్జ్ డీపీఓగా జడ్పీ సీఈవోని నియమించారు.

Updated Date - 2020-07-01T03:31:03+05:30 IST