భౌతిక దూరం పాటించాలి

ABN , First Publish Date - 2020-05-20T09:46:52+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని డీఎంఅండ్‌ హెచ్‌వో దశరత్‌ అన్నారు. ఐలాబాద్‌ తండాలో హోం

భౌతిక దూరం పాటించాలి

దోమ: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని డీఎంఅండ్‌ హెచ్‌వో దశరత్‌ అన్నారు. ఐలాబాద్‌ తండాలో హోం క్వారంటైన్‌లో ఉన్న వారితో ఆయన మంగళవారం మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయటకు రావొద్దన్నారు. ఉపసర్పంచ్‌ మోతీలాల్‌, నర్సింహులు, వెంకట్‌రాములు, గోవింద్‌పాల్గొన్నారు.


ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇద్దరు, రాజస్తాన్‌ నుంచి ఒకరు మర్పల్లికి చేరుకోవడంతో అఽధికారులు వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. తప్పనిసరిగా 28 రోజుల వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని తహసీల్దార్‌ తులసీరాం సూచించారు. 


ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, వైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం పూణే నుంచి మండల పరిధిలోని ముజాహిత్‌పూర్‌, అల్లాపూర్‌ తండాలకు వచ్చిన ప్రజలకు కులకచర్లలో వైద్య పరీక్షలు నిర్వహించి మాట్లాడారు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రతి రోజు సేకరిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. 

Updated Date - 2020-05-20T09:46:52+05:30 IST