Abn logo
May 12 2021 @ 10:25AM

మాయమైన ‘భౌతికదూరం’

లాక్‌డౌన్‌ ప్రకటనతో కొనుగోళ్లకు ఎగబడ్డ జనం

హైదరాబాద్/సైదాబాద్‌: పదిరోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటన రావడంతో  ఒక్కసారి ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చారు. సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా కిరాణ దుకాణాలు, కూరగాయలను కోనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ముఖ్యంగా మాదన్నపేట కూరగాయల మార్కెట్‌కు పెద్దసంఖ్యలో జనాలు రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మార్కెటంతా రద్దీ ఏర్పడింది.


వైన్స్‌ దుకాణాల ముందు బారులు

బుధవారం నుంచి లాక్‌డౌన్‌ ఉంటుందని తెలియగానే  వైన్స్‌ దుకాణాలకు  మందుబాబులు పోటెత్తారు. సైదాబాద్‌, చంపాపేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, మీర్‌పేట, హయత్‌నగర్‌, నాగోల్‌, కర్మన్‌ఘాట్‌ ప్రాంతాలలో వైన్స్‌ దుకాణాల ఎదుట మద్యం కోసం బారులు తీరారు. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగాయి. పలు దుకాణాలలో మద్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. కొందరు వైన్స్‌ యాజమానులు ఇదే అదనుగా భారీ స్థాయిలో బెల్ట్‌ షాపులకు మద్యం తరలించారు. 

Advertisement
Advertisement