స్టిక్కర్లుగా ఫొటోలు

ABN , First Publish Date - 2022-06-04T09:02:11+05:30 IST

స్టిక్కర్లుగా ఫొటోలు

స్టిక్కర్లుగా ఫొటోలు

వినూత్న మార్పులు, చేర్పులతో వాట్సాప్‌ ఎప్పుడూ డైనమిక్‌గా ఉంటుందనడలో సందేహం లేదు. ఇన్‌స్టాంట్‌ మెసేజ్‌లకు నెలవైన ఇది ఇమేజ్‌ స్టిక్కర్లకే పరిమితం కావటం లేదు. మీ ఫొటో లేదంటే మనం అనుకున్న ఇమేజ్‌ స్టిక్కర్‌గా మార్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది. వాట్సాప్‌ వెబ్‌తో మాత్రమే ఫొటోను స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు. వాట్సాప్‌ మొబైల్‌ యాప్‌లో మాత్రం ఈ ఫీచర్‌ అందుబాటులో లేదు. మరికొన్ని యాప్‌లు ఇందుకు సహకరిస్తాయి. అయితేనే సలువుగా పనికానిచ్చుకోవచ్చు. ఇదెలాగంటే


మీది లేదంటే మరెవరిదైనా ఫొటోను స్టిక్కర్‌గా మార్చుకోవాలి అనుకుంటే వాట్సాప్‌ వెబ్‌లోని చాట్‌ విండోస్‌ దగ్గరకు వెళ్ళాలి. లేదంటే పీసీలో డెస్క్‌టాప్‌పై వాట్సాప్‌లోకి వెళ్ళాలి.

మొదట ఒక స్టిక్కర్‌ని అటాచ్‌మెంట్‌ సింబల్‌ని క్లికింగ్‌ ద్వారా చేయాలి. పేపర్‌ క్లిప్‌తో డినోట్‌ అయి ఉండాలి. 

మీ డివైస్‌పై ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ పాపప్‌ అవుతుంది. కన్వర్ట్‌ చేయాలని అనుకుంటున్న ఇమేజ్‌ని పికప్‌ చేయడానికి టైమ్‌ అయిందన్నమాట.

స్ర్కీన్‌పై కనిపించే బాక్స్‌ వద్ద ఇమేజ్‌ని అడ్జస్ట్‌ చేయాలి. అప్పుడు సెండ్‌ యారోని టాప్‌ చేయాలి. 

రైటి క్లిక్‌ లేదంటే లాంగ్‌ ప్రెస్‌ ద్వారా వాట్సాప్‌ స్టిక్కర్‌ని సేవ్‌ చేయాలి.

సేవ్‌ చేసుకుంటే చాలు

Updated Date - 2022-06-04T09:02:11+05:30 IST