పీపీఈ సూట్‌‌పై పెళ్లి ప్రపోజల్.. వైరల్ అవుతున్న ఫోటో

ABN , First Publish Date - 2021-01-04T02:45:11+05:30 IST

గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేయడం ఓ కళ. ఆ కళలో ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. ఇటలీలోని ఓ నర్స్ కూడా ఇలాంటి టాలెంట్‌తోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాడు. ఇంత వెరైటీగా..

పీపీఈ సూట్‌‌పై పెళ్లి ప్రపోజల్.. వైరల్ అవుతున్న ఫోటో

రోమ్: గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేయడం ఓ కళ. ఆ కళలో ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. ఇటలీలోని ఓ నర్స్ కూడా ఇలాంటి టాలెంట్‌తోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాడు. ఇంత వెరైటీగా ప్రపోజ్ చేస్తే ఎవరైనా కాదంటారా..? ఆమె కూడా ఓకే చెప్పేసింది. దీంతో ఓ హ్యాపీ ఎండింగ్‌ పడింది వీరి స్టోరీకి. ఇటలీలోని పుగిలాలోని ఒస్తుని హాస్పటల్‌లో గుసెప్పే పున్‌గెంటే అనే యువకుడు నర్స్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్‌ కారెమెల్‌కి పెళ్లి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అయితే కరోనా నిబంధనల ప్రకారం పూర్తిగా పీపీఈ కిట్‌ ధరించి ఉన్నాడు. దీంతో ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచించాడు.


అంతే తన పీపీఈ కిట్ వెనుక వైపు ‘కారెమెల్.. నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని రాసి ఉంది. దాని కింద ‘ఎస్’ ఆర్ ‘నో’ అని రాసి ఉంది. ఈ ప్రపోజ్ చూసిన అతడి గర్ల్ ఫ్రెండ్ కారెమెల్ వెంటనే ఓకే చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-01-04T02:45:11+05:30 IST