ఫాస్ట్ చార్జర్లతో ఫోన్లు పేలిపోయే ప్రమాదం...

ABN , First Publish Date - 2020-07-23T00:11:12+05:30 IST

వేగంతో పోటీ పడుతోంది ప్రస్తుత ప్రపంచం. ప్రతీ విషయంలోనూ వేగానిదే ప్రాధాన్యత. మొబైల్ ఫోన్‌ల ఛార్జింగ్‌లోనూ అంతే. ఈ క్రమంలోనే... ‘ఫాస్ట్ ఛార్జింగ్’ అన్నది ప్రాధాన్యతాంశమైంది.

ఫాస్ట్ చార్జర్లతో ఫోన్లు పేలిపోయే ప్రమాదం...

ముంబై : వేగంతో పోటీ పడుతోంది ప్రస్తుత ప్రపంచం. ప్రతీ విషయంలోనూ వేగానిదే ప్రాధాన్యత. మొబైల్ ఫోన్‌ల ఛార్జింగ్‌లోనూ అంతే. ఈ క్రమంలోనే... ‘ఫాస్ట్ ఛార్జింగ్’ అన్నది ప్రాధాన్యతాంశమైంది. 

అయితే... బ్యాడ్‌పవర్ జెడ్‌నెట్ నివేదిక ప్రకారం... బ్యాడ్‌పవర్ ఫాస్ట్ ఛార్జర్‌ను పాడు చేస్తుంది, అంతేకాదు... ఛార్జింగ్ ప్రాసెస్ కోసం వోల్టేజ్‌పై చిప్ ఫర్మ్‌వేర్‌తోపాటు ఛార్జింగ్ పరికరాన్ని అనుసంధానించడంలో విఫలమవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్‌లలో కొన్ని 20 వోల్ట్‌లతో ఛార్జ్ చేస్తాయి. కొన్ని పరికరాలు కేవలం 5 వోల్ట్‌లను మాత్రమే సురక్షితంగా స్వీకరిస్తాయి. కాగా... మొబైల్ ఫోన్లను సురక్షితంగా ఛార్జ్ చేయగలిగే వోల్టేజీ కంటే ఎక్కువ వోల్టేజ్ ను ఓవర్‌లోడ్ చేయడం ద్వారా ఫోన్‌లలో మంటలు చెలరేగే అవకాశముంటుంది. దీనిని తనిఖీ చేయడానికి... ఛార్జర్ ఫర్మ్‌వేర్‌ను ధ్వంసం చేసేందుకు గాను పరిశోధకులు మొబైల్ ఫోన్‌గా ఉన్న ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. ఈ సందర్భంలో ‘హానికరమైన ప్రోగ్రామ్‌’లు, బాడ్‌పవర్ సోకిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఉపకరణాలు... ఛార్జర్‌ల ఫర్మ్‌వేర్‌ను ధ్వంసం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. డేటాను దొంగిలించే మాల్వేర్ ఈ క్రమంలో... పరికరాలు పేలిపోకుండా నిరోధించేందుుగాను... తయారీదారులు తక్కువ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు తోడ్పడే పరికరాలకు అదనపు ఫ్యూజ్లను జోడించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వినియోగదారులు తమ ఫోన్ ఛార్జర్లు, పవర్ బ్యాంకులను ఇతర పరికరాల కోసం వినియోగించడం ప్రమాదమని చెబుతున్నారు. 


Updated Date - 2020-07-23T00:11:12+05:30 IST