ఫోన్‌ రోజూ రీస్టార్ట్‌ చేయాల్సిందేనా...

ABN , First Publish Date - 2020-03-14T06:03:01+05:30 IST

నా దగ్గర క్సోలో ఎరా-2 ఫోన్‌ ఉంది. ఏడాదిన్నరగా జియో సిమ్‌ వాడుతున్నాను. చాలాసార్లు ఫోన్‌ కనెక్షన్‌ పోతోంది. ఎవరైనా కాల్‌ చేసినా కాల్‌ కలవదు. ఫోన్‌ లో సిమ్‌ లేదని వస్తోంది.

ఫోన్‌ రోజూ రీస్టార్ట్‌ చేయాల్సిందేనా...

నా దగ్గర క్సోలో ఎరా-2 ఫోన్‌ ఉంది. ఏడాదిన్నరగా జియో సిమ్‌ వాడుతున్నాను. చాలాసార్లు ఫోన్‌ కనెక్షన్‌ పోతోంది. ఎవరైనా కాల్‌ చేసినా కాల్‌ కలవదు. ఫోన్‌ లో సిమ్‌ లేదని వస్తోంది. సిమ్‌ వేసినా ఫోన్‌ రీస్టార్ట్‌ చెయ్యాలని సూచిస్తోంది.. సిమ్‌ ఫోన్‌లోనే ఉన్నా దాదాపు ప్రతీ రోజు ఇలా  రీస్టార్ట్‌ చేయాల్సి వస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి?

- శోభాదేవి


ప్రస్తుతం మీరు వాడుతున్న సిమ్‌ కార్డ్‌లో లేదా మీ ఫోన్‌లో ఉన్న సిమ్‌ కార్డ్‌ స్లాట్‌లో సమస్య ఉండి ఉంటుంది. డూప్లికేట్‌ సిమ్‌ తీసుకొని, ఆ కొత్త సిమ్‌ దాంట్లో అమర్చితే దాదాపు సమస్య పరిష్కరం అవుతుంది. చాలా అరుదైన సందర్భాలలో మన ఫోన్‌లో ఉండే సిమ్‌ కార్డ్‌ స్లాట్‌ డ్యామేజ్‌ అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఫోన్‌ను సర్వీస్‌ సెంటర్‌లో ఇవ్వండి. స్లాట్‌ మార్చడం గానీ, దాన్ని శుభ్రపరచడం గానీ చేసి ఇక మీదట సమస్య రాకుండా చేస్తారు. ఈ రెండూ కాకుండా మీ ఫోన్‌లోని రేడియో చిప్‌ (ఇది నెట్‌వర్క్‌ కమ్యూనికేషన్‌ కోసం ప్రధానంగా ఉపయోగిస్తారు)లో ఇబ్బంది ఉన్నా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. అలాంటప్పుడు సర్వీస్‌ సెంటర్‌ ద్వారా దాన్ని సరిచేయడానికి కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంది.

Updated Date - 2020-03-14T06:03:01+05:30 IST