క్రెడిట్‌కార్డుకు రివార్డుల పేరిట కాల్ చేస్తున్నారా..!?

ABN , First Publish Date - 2021-07-04T14:54:10+05:30 IST

క్రెటిట్‌కార్డుకు రివార్డులు వచ్చాయంటూ ఫోన్‌చేసి

క్రెడిట్‌కార్డుకు రివార్డుల పేరిట కాల్ చేస్తున్నారా..!?

  • రూ.60 వేల టోకరా


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : క్రెటిట్‌కార్డుకు రివార్డులు వచ్చాయంటూ ఫోన్‌చేసి రూ.60 వేలు టోకరా వేశారు. ఈ డబ్బు కట్టుకోవడానికి నిందితులే ఈ ఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేశారు. విశాఖపట్నంకు చెందిన పడవల ప్రవల్లిక బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో నివాసముంటూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు గత నెల 28న స్లైస్‌ క్రెడిట్‌ కార్డు కార్యాలయం నుంచి ఒకరు కిషన్‌సింగ్‌ పేరుతో ఫోన్‌ చేశాడు. క్రెడిట్‌కార్డుకు రివార్డు పాయింట్లు వచ్చాయని వాటిని క్లెయిమ్‌ చేసుకోవాలని చెప్పాడు. ఇందుకోసం ఆమె సెల్‌ఫోన్‌కు  ఓటీపీని పంపించాడు. అతని మాట నమ్మిన ప్రవల్లిక ఓటీపీ చెప్పింది. అనంతరం పేటీఎంలో పాయింట్లు జమ చేస్తామని మరో ఓటీపీ పంపించారు. అది కూడా అతనికి చెప్పింది. అంతే.. కొద్ది సేపటికి ఆమె క్రెడిట్‌కార్డు నుంచి రూ.60 వేల డ్రా అయినట్టు మెసేజ్‌ వచ్చింది. ఈ డబ్బును ఈ ఎంఐ ద్వారా కట్టే విధంగా నిందితులు ఎంపిక చేశారు. మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-04T14:54:10+05:30 IST