టీవీ రిమోట్‌గా ఫోన్‌!

ABN , First Publish Date - 2021-03-06T06:07:15+05:30 IST

మోబైల్‌ ఫోన్‌ వచ్చాక చాలా వస్తువులు మూలన పడ్డాయి. రేడియో, టేప్‌రికార్డర్‌, వాచ్‌, కెమెరా వంటి వాటి జతకు టీవీ రిమోట్‌ కూడా చేరనుంది. మోబైల్‌ ఫోన్‌ నుంచే టీవీని ఆపరేట్‌ చేసే పనిలో గూగుల్‌ ఉంది. త్వరలోనే ఇది ఆచరణలోకి రానుంది

టీవీ రిమోట్‌గా ఫోన్‌!

మోబైల్‌ ఫోన్‌ వచ్చాక చాలా వస్తువులు మూలన పడ్డాయి. రేడియో, టేప్‌రికార్డర్‌, వాచ్‌, కెమెరా వంటి వాటి జతకు టీవీ రిమోట్‌ కూడా చేరనుంది. మోబైల్‌ ఫోన్‌ నుంచే టీవీని ఆపరేట్‌ చేసే పనిలో గూగుల్‌ ఉంది. త్వరలోనే ఇది ఆచరణలోకి రానుంది. 


ఇంట్లో ఆండ్రాయిడ్‌ టీవీ ఉంటే చాలు, మీరు రెగ్యులర్‌గా వాడే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి దాన్ని టీవీ రిమోట్‌గా ఉపయోగించుకోవచ్చు. 9 టు 5 గూగుల్‌ నివేదిక ప్రకారం ఆండ్రాయిడ్‌లో గూగుల్‌ టీవీ యాప్‌నకు ఈ మేరకు సమాచారం అందింది.  డైరెక్షన్‌ ప్యాడ్‌పై ఉన్న ఎంటర్‌, బ్యాక్‌ బటన్ల ద్వారా ఫోన్‌ నుంచి టీవీని ఆపరేట్‌ చేయవచ్చు.


ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుందో ‘ఎక్స్‌డిఎ డెవలపర్స్‌’ తన నివేదికలో తెలిపింది. అందుబాటులో ఉన్న టీవీతో మోబైల్‌ను పెయిర్‌ చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియ పూర్తయితే చాలు, సెల్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. వైఫై లేదా బ్లూటూత్‌ సహకారంతో గూగుల్‌ టీవీ యాప్‌ కనెక్ట్‌ అవుతుంది. ఇంతకుమునుపు గూగుల్‌కి రిమోట్‌ కంట్రోల్‌ యాప్‌ లేదు. దీనికి సంబంధించి గూగుల్‌ ఎలాంటి కామెంట్స్‌ చేయనప్పటికీ బేటా వెర్షన్‌లో ఇది కనిపిస్తోంది. త్వరలో ఇది అందుబాటులోకి రావచ్చు. 

Updated Date - 2021-03-06T06:07:15+05:30 IST