కుంకుమపువ్వుతో కఫం దూరం

ABN , First Publish Date - 2022-10-04T05:30:00+05:30 IST

చలికాలం వైర్‌సలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కుంకుమపువ్వు కషాయం తాగాలి.

కుంకుమపువ్వుతో కఫం దూరం

చలికాలం వైరస్‌లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో కుంకుమపువ్వు కషాయం తాగాలి.


ఊపిరితిత్తులను శుభ్రపరిచి, ఉబ్బసం, సైన్‌సల నుంచి కూడా విముక్తి కల్పింస్తుంది. 


కావలసిన పదార్థాలు:

కుంకుమ పువ్వు -  చిటికెడు   

యాలకులు - 4

దాల్చినచెక్క పొడి - చిటికెడు

దంచిన అల్లం - పావు చెంచా

నీళ్లు - రెండు కప్పులు


తయారీ విధానం:

  • నీళ్లలో పైన చెప్పిన దినుసులన్నీ వేసి మధ్యస్తమైన మంట మీద ఉడికించాలి. 
  • 3 నిమిషాల తర్వాత పొయ్యి నుంచి దించి, చల్లార్చాలి.
  • తీపి కోసం ఒక చెంచా తేనె కలుపుకుని తాగాలి.

Updated Date - 2022-10-04T05:30:00+05:30 IST