Ahmedabad IIMలో పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2022-10-05T20:26:52+05:30 IST

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంఏ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నుంచి అయిదేళ్ల

Ahmedabad IIMలో పీహెచ్‌డీ

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంఏ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నుంచి అయిదేళ్ల వరకు ఉంటుంది. మొదటి రెండేళ్లు ఇంటెన్సివ్‌ కోర్సు వర్క్‌, కాంప్రహెన్సివ్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి. తరవాత డాక్టోరల్‌ డిజర్టేషన్‌ ఉంటుంది. 


స్పెషలైజేషన్‌లు: అగ్రికల్చర్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, ప్రొడక్షన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌, పబ్లిక్‌ సిస్టమ్స్‌, స్ట్రాటజీ

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏదేని మాస్టర్స్‌ డిగ్రీ/ రెండేళ్ల పీజీ డిప్లొమా పూర్తిచేసినవారు; అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ స్థాయుల్లో కనీసం 55 శాతం మార్కులు ఉండాలి. ద్వితీయ శ్రేణి మార్కులతో సీఏ/ సీఎస్‌/ సీఎంఏ ఉత్తీర్ణులు; కనీసం 6.5 సీజీపీఏతో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారూ అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు 2023 డిసెంబరు 31 నాటికి సర్టిఫికెట్‌లు సబ్మిట్‌ చేయాలి. క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా స్పెషలైజేషన్‌ను అనుసరించి నిర్దేశిత స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్‌ ఉండాలి. విదేశీ విద్యార్థులకు జీఆర్‌ఈ/ జీమ్యాట్‌ స్కోర్‌ ఉండాలి.


స్పెషలైజేషన్‌లు - స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్‌లు 

అగ్రికల్చర్‌: జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ యూజీసీ-జేఆర్‌ఎ్‌ఫ(ఎకనామిక్స్‌/డెవల్‌పమెంట్‌ స్టడీస్‌/డెవల్‌్‌పమెంట్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/మేనేజ్‌మెంట్‌), ఐకార్‌-ఎ్‌సఆర్‌ఎఫ్‌  

ఎకనామిక్స్‌, ఇన్నొవేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌, పబ్లిక్‌ సిస్టమ్స్‌, ప్రొడక్షన్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ మెథడ్స్‌: జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/ యూజీసీ జేఆర్‌ఎఫ్‌

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, మార్కెటింగ్‌, స్ట్రాటజీ: జీఆర్‌ఈ/జీమ్యాట్‌  

హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌: జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌

ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌: జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ యూజీసీ జేఆర్‌ఎఫ్‌

ఎంపిక: క్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/స్టాండర్డ్‌ టెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి 2023 మార్చి- ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

ఫెలోషిప్‌: ఎంపికైన  అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.37,700;  కాంప్రెహెన్సివ్‌ ఎగ్జామ్‌ పూర్తిచేసిన తరవాత నెలకు రూ. 40,700; టీఏసీ ఆమోదించిన థీసిస్‌ సమర్పించిన తరవాత నెలకు రూ.45,200 చెల్లిస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500 ఫ చివరి తేదీ: 2023 జనవరి 17

వెబ్‌సైట్‌: www.iima.ac.in/phd

Updated Date - 2022-10-05T20:26:52+05:30 IST