విద్యకు వైకల్యం అడ్డుకాదు

ABN , First Publish Date - 2022-06-21T15:11:31+05:30 IST

చదువుకోవాలనే ఆసక్తి ఉంటే దాని ముందు వైకల్యం కూడా ఓడిపోవాల్సిం దేనని నిరూపించింది ఈ విద్యార్థిని. రెండు చేతులు లేక పోవడంతో టీచర్‌

విద్యకు వైకల్యం అడ్డుకాదు

- టీచర్‌ సాయంతో ప్లస్‌ టూ పరీక్ష రాసిన విద్యార్థిని

- 277 మార్కులతో ఉత్తీర్ణత


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 20: చదువుకోవాలనే ఆసక్తి ఉంటే దాని ముందు వైకల్యం కూడా ఓడిపోవాల్సిం దేనని నిరూపించింది ఈ విద్యార్థిని. రెండు చేతులు లేక పోవడంతో టీచర్‌ సహాయంతో పరీక్ష రాసిన విద్యార్థిని 277 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. మైలాడుదురై ప్రభుత్వ మహిళా మహోన్నత పాఠశాలలో ప్లస్‌ టూ చదువుతున్న లక్ష్మికి రెండు చేతులు లేవు. గత నెలలో జరిగిన పబ్లిక్‌ పరీక్షల్లో టీచర్‌ సాయంతో పరీక్షలు రాసింది. పుట్టినప్పటి నుంచే రెండు చేతులు లేని ఆడపిల్ల కావడంతో రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు వదిలేయడంతో మైలాడుదురై అనాథాశ్రమంలో చేరింది. ఈ క్రమంలో, సోమవారం విడుదలైన ఫలితాల్లో లక్ష్మి 277 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. లక్ష్మిని ఆశ్రమ నిర్వాహకులు, అక్కడ ఉంటున్న వారు ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు.

Updated Date - 2022-06-21T15:11:31+05:30 IST