పీహెచ్‌సీకి వైద్యులను నియమించండి

ABN , First Publish Date - 2020-09-28T11:36:58+05:30 IST

కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి(పీహెచ్‌సీ) వైద్యులను నియమించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు

పీహెచ్‌సీకి వైద్యులను నియమించండి

జిల్లా వైద్యాధికారికి కొమరగిరి గ్రామస్థుల మొర


కొమరగిరి(కొత్తపల్లి), సెప్టెంబరు 27: కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి(పీహెచ్‌సీ) వైద్యులను నియమించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి గతంలో ఇద్దరు మహిళా వైద్యులు సేవలందించేవారు. ఇటీవల డాక్టర్‌ రుక్ష్మిణికి పదోన్నతి రావడంతో కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఉన్న ఒక వైద్యురాలు కూడా కాకినాడలో వేరే చోట విధులు నిర్వర్తిసూ పీహెచ్‌సీకి వచ్చే రోగుల బాగోగులు గాలికి వదిలేసారని మాజీ ఎంపీటీసీ కండేపల్లి నూకరాజు ఆరోపించారు. ప్రస్తుతం కరోనా, వైరల్‌ జ్వరాలతో గ్రామస్థులు సతమతమవుతున్నారని ఆవేదన చెందారు. ఇద్దరు వైద్యులూ లేకపోవడంతో రోగా ల బారిన పడిన ప్రజలు వ్యయ ప్రయాసలతో పిఠాపురం ఆసుపత్రులకు వెళ్లొస్తున్నారన్నారు. పీహెచ్‌సీకి కనీసం ఒక్క వైద్యాధికారినైనా నియమించాలని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌, వైద్యశాఖాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2020-09-28T11:36:58+05:30 IST