రానున్నద ఐదేళ్ళలో దశలవారీగా డేటా సెంటర్లు : ఎల్అండ్‌టీ

ABN , First Publish Date - 2021-11-24T05:30:00+05:30 IST

తమిళనాడు ప్రభుత్వంతో ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులోని కాంచిపురంలో డేటా సెంటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

రానున్నద ఐదేళ్ళలో దశలవారీగా డేటా సెంటర్లు : ఎల్అండ్‌టీ

చెన్నై : తమిళనాడు ప్రభుత్వంతో ఎల్‌అండ్‌టీ ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులోని కాంచిపురంలో డేటా సెంటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న  ఐదేళ్ళలో దశలవారీగా డేటా కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్టు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలో ఈ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసి,  తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు ఎల్అండ్‌టీ వెల్లడించింది. కొత్త ఆర్డర్‌ నేపధ్యంలో బుధవారం ఎల్‌అండ్‌టీ ఓ మోస్తరు లాభాల్లో ట్రేడవుతోంది. బుధవారం ఉదయం కొత్త ఆర్డర్‌ రాకతో ఒక శాతం లాభంతో డే గరిష్ట స్థాయి రూ. 1902 కు చేరిన స్టాక్‌... ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ప్రస్తుతం డే కనిష్ట స్థాయికి సమీపంలో, స్వల్ప లాభంతో రూ. 1,890 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు ఐదు లక్షల షేర్లు ట్రేయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 2,65,500 కోట్లకు చేరింది. కంపెనీ ఈపీఎస్‌ 62.31, పీఈ 30.35గా ఉన్నాయి.

Updated Date - 2021-11-24T05:30:00+05:30 IST