బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో హెచ్చార్సీ విచారణ

ABN , First Publish Date - 2021-02-26T01:20:07+05:30 IST

బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. రాచకొండ పోలీసులు అత్యుత్సాహం

బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో హెచ్చార్సీ విచారణ

హైదరాబాద్: బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. రాచకొండ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఘట్‌కేసర్‌లో బీ-ఫార్మసీ విద్యార్థిని అఘాయిత్యం చేసుకుందంటూ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్చాఆర్సీ) లో పిటిషన్‌ దాఖలైంది. విద్యార్థిని కిడ్నాప్‌ డ్రామా ఆడిందని ప్రెస్‌మీట్‌ పెట్టి అధికారులు వెల్లడించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ అరుణ్‌‌కుమార్‌ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ వేశారు. హెచ్చార్సీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ బీఫార్మసీ విద్యార్థిని జీవించే హక్కు కోల్పోయేలా పోలుసులు వ్యవహరించారని తప్పుబట్టారు. మీడియా సమావేశం పెట్టి అమ్మాయి కేసులోని సున్నితమైన విషయాలను పోలుసులు బహిర్గతం చేశారని విమర్శించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని పిటిషనర్ హెచ్చార్సీ దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులను తమ మందు ఉంచాలని మానవ హక్కుల కమిషన్ కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణ మార్చ్ 6 తేదీకి వాయిదా పడింది.


Updated Date - 2021-02-26T01:20:07+05:30 IST