Abn logo
Mar 30 2020 @ 06:15AM

మెడికల్ షాపుల్లో మాస్క్‌ల విక్రయాల నిలిపివేత

తిరువనంతపురం (కేరళ): దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో పలు మెడికల్ షాపుల్లో మాస్క్‌ల విక్రయాలను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం మాస్క్ లు, శానిటైజర్లకు ధరలు నిర్ణయించి, నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం మెడికల్ షాపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరంలోని పలు మెడికల్ షాపుల్లో మాస్క్ ల విక్రయాలను నిలిపివేశారు. మాస్క్ లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించలేమని చెప్పి అసలు మాస్క్ ల విక్రయాలను నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండగా, మరో వైపు మాస్క్ ల విక్రయాలను మందుల దుకాణాల్లో నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement