నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్‌

ABN , First Publish Date - 2020-10-25T11:37:37+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేస్తే షాపులు సీజ్‌ చేస్తామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఫణికుమార్‌ తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే షాపులు సీజ్‌

ఇచ్ఛాపురం: కొవిడ్‌  నిబంధనలు  అతిక్రమించి వ్యాపారాలు చేస్తే షాపులు సీజ్‌ చేస్తామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఫణికుమార్‌ తెలిపారు.  శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయంలో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షాపు యజమానులు, కూలీలు మాస్కులు  ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఫకీర్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:37:37+05:30 IST