ఆదర్శ పాఠశాలలకు పీజీటీ, టీజీటీలు

ABN , First Publish Date - 2022-08-06T20:52:47+05:30 IST

ఆదర్శ పాఠశాల(Ideal school)ల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(Post Graduate Teacher)(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)లను

ఆదర్శ పాఠశాలలకు పీజీటీ, టీజీటీలు

282 మందిని కాంట్రాక్టుపై తీసుకునేందుకు నోటిఫికేషన్‌

8 నుంచి దరఖాస్తుల స్వీకరణ


అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాఠశాల(Ideal school)ల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(Post Graduate Teacher)(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)లను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ(Department of Education) అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 282 మందిని కాంట్రాక్టుపై తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 211 పీజీటీ, 71 టీజీటీ పోస్టులు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 17 వరకు దరఖాస్తులకు గడువుందని పేర్కొంది. 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉన్నవారు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌..  ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 49ఏళ్ల వరకు అవకాశం ఉందని తెలిపింది. ఈ భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుందని, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మినిమం టైమ్‌ స్కేలు ప్రకారం వీరికి వేతనాలు ఇస్తారని వివరించింది. 

Updated Date - 2022-08-06T20:52:47+05:30 IST