ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
బిజినెస్
ఎడిటోరియల్
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ప్రవాస
క్రైమ్
రాశిఫలాలు
వంటలు
ePaper
Weekly
Sunday
ఎడ్యుకేషన్
సాహిత్యం
ప్రత్యేకం
ఫొటోలు
వీడియోలు
ఆరోగ్యం
ఓపెన్ హార్ట్
40 ఏళ్లగా కాకతీయ మ్యారేజస్.పెళ్లి సంబంధాలకు ఉచితం గా రిజిస్టర్ కండి.
PH: 9390 999 999, 98481 97 222
Feb 24 2021 @ 00:25AM
హోం
ఆంధ్రప్రదేశ్
కర్నూలు
పీజీ కౌన్సిలింగ్ గందరగోళం
పీసీ సెట్ కౌన్సిలింగ్‌లో విద్యార్థుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్ అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు చూడబడును.
PH: 9397979750
ఉన్నతమైన కుటుంబాల ఎంపిక
ప్రొవిజన్ సర్టిఫికెట్ల పరిశీలన తీరుపై అభ్యంతరం
వెరిఫికేషన్ అధికారిని తొలగించాని డిమాండ్
కర్నూలు(అర్బన్), ఫిబ్రవరి 23:
రాయలసీమ యూనివర్సిటీలో పీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ గందరగోళానికి దారి తీసింది. మంగళవారం ఉదయం సెంట్రల్ లైబ్రరీలో డైరెక్టర్ ప్రొఫెసర్ రాణి ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అధికారి ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాచి. ఏ యూనివర్సిటీలో లేని నిబంధనలకు తెరపైకి తెచ్చారని ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం కన్వీనరు దిలీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొవిజన్ సర్టిఫికెట్‌తో పాటు మార్కుల లిస్టు కూడా కావాలని అధికారి కోరడంతో కౌన్సిలింగ్‌కు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగారు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు వారికి మద్దతుగా ఆందోళనకు దిగారు. విద్యార్థులకు కనీస సౌకార్యలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. లేని పోని నిబంధనలు పెట్టి విద్యార్థులను వెనక్కి పంపడం దారుణమన్నారు. ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిని వెరిఫికేషన్ అధికారిగా తొలగించాలని ధర్నా నిర్వహించారు. పోలీసులు వచ్చి విద్యార్థి సంఘాల నాయకులకు సర్దిచెప్పారు.
136 మంది విద్యార్థుల హాజరు
కౌన్సిలింగ్‌కు 136 మంది విద్యార్థులు హాజరయ్యారని పీజీ సెట్ డైరెక్టర్, ప్రొఫెసర్ రాణి తెలిపారు. ఎంఏ ఎకనామిక్స్ 51, ఎంఏ హిస్టరీ 16, పోలిటికల్ సైన్సు 22, ఎడ్యుకేషన్ ఎంఈడీ 11, పిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) 36 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు.
Advertisement
కర్నూలు
మరిన్ని...
Advertisement
ఆంధ్రప్రదేశ్
మరిన్ని...
ప్రవాస
మరిన్ని...
Advertisement