Hyderabad Nicmarలో పీజీ ప్రోగ్రామ్‌లు

ABN , First Publish Date - 2022-07-05T22:39:47+05:30 IST

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌(నిక్మర్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవి ఫుల్‌ టైం ఆన్‌ క్యాంపస్‌

Hyderabad Nicmarలో పీజీ ప్రోగ్రామ్‌లు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌(National Institute of Construction Management and Research)(నిక్మర్‌) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవి ఫుల్‌ టైం ఆన్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు. సంస్థ నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌క్యాట్‌), గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేట్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. కనీసం 50 శాతం మార్కులతో ఏదేని ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఏదేని ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా బీఎస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతోపాటు మాన్యుఫాక్చరింగ్‌, మెయింటెనెన్స్‌, ఆర్‌ అండ్‌ డి, సేఫ్టీ విభాగాల్లో ఏడాది అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌/ మేనేజ్‌మెంట్‌/ ఎకనామిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌/ అగ్రికల్చర్‌ విభాగాల్లో ద్వితీయశ్రేణి మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇంజనీరింగ్‌/ఆర్కిటెక్చర్‌/సైన్స్‌ విభాగాల్లో ద్వితీయ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. 

ఎన్‌క్యాట్‌ వివరాలు: పరీక్షని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. దీనికి 180 మార్కులు నిర్దేశించారు. ఇందులో క్వాంటిటేటివ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ నుంచి 72 మార్కులకు, డేటా ఇంట్రప్రిటేషన్‌ నుంచి 36 మార్కులకు, వెర్బల్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీ నుంచి 72 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో సాధించిన మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.  

  • గ్రూప్‌ డిస్కషన్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 మార్కులు, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌కు 70 మార్కులు ప్రత్యేకించారు.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: ఒక ప్రోగ్రామ్‌నకు రూ.2100; ఒకటి కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లకు రూ.2620

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20 

ప్రజంటేషన్‌ సెషన్‌, మాక్‌ టెస్ట్‌ తేదీ: జూలై 22

నిక్మర్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఎన్‌క్యాట్‌) తేదీ: జూలై 23

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ: జూలై 26 

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: జూలై 28

ట్యూషన్‌ ఫీజు చెల్లింపులు: ఆగస్టు 11న

తరగతులు ప్రారంభం: ఆగస్టు 16 నుంచి

వెబ్‌సైట్‌: nicmar.ac.in

Updated Date - 2022-07-05T22:39:47+05:30 IST