పీజీ మెడికల్‌ మూడో విడత నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-07-05T07:14:36+05:30 IST

పీజీ వైద్య విద్య కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఆది, సోమ వారాల్లో వెబ్‌ ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్‌

పీజీ మెడికల్‌ మూడో విడత నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : పీజీ వైద్య విద్య  కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి  ఆది, సోమ వారాల్లో వెబ్‌ ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్‌ ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం శనివారం మూడో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చెసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలకు, నిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా  భర్తీ చేయనుంది.  తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అఖిల భారత స్థాయిలో మిగిలిపోయిన సీట్లను కూడా ఈ విడతలో భర్తీ చేయనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించాలని  ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-05T07:14:36+05:30 IST