8 నుంచి కేయూ పీజీ ఆఖరు సెమిస్టర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-24T08:47:52+05:30 IST

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అక్టోబరు 8 నుంచి పీజీ రెగ్యులర్‌ కోర్సుల ఆఖరు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు

8 నుంచి కేయూ పీజీ ఆఖరు సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌, సెప్టెంబరు 23: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అక్టోబరు 8 నుంచి  పీజీ రెగ్యులర్‌ కోర్సుల ఆఖరు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎం.సురేఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీజే కోర్సుల రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు వచ్చేనెల 8, 10, 12, 14, 16, 19వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు  జరుగుతాయని స్పష్టం చేశారు. రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌ విద్యార్థులందరూ పరీక్షలకు హాజరుకావాలని వారు కోరారు.


8నుంచి ఎంఎల్‌ఐఎస్సీ, సెరికల్చర్‌ పరీక్షలు 

 ఎంఎల్‌ఐఎస్సీ, సెరికల్చర్‌ సెమిస్టర్‌ కోర్సుల పరీక్షలను అక్టోబరు 8, 10, 12, 14వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 


ఒకటి నుంచి ఎంఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు..

కేయూ పరిధిలోని ఎంఎడ్‌ రెండో ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు అక్టోబరు 1 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. వచ్చేనెల 1, 3, 5, 7, 9వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. రెగ్యులర్‌, ఇంప్రూవ్‌మెంట్‌, ఎక్స్‌ విద్యార్థులు హాజరుకావాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2020-09-24T08:47:52+05:30 IST