Ambedkar Universityలో పీజీ, పీజీ డిప్లొమా

ABN , First Publish Date - 2022-09-21T21:33:24+05:30 IST

శ్రీకాకుళం(Srikakulam)లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ(Dr. BR Ambedkar University) (బీఆర్‌ఏయూ) - మాస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంహెచ్‌ఏ), పీజీ డిప్లొమా

Ambedkar Universityలో పీజీ, పీజీ డిప్లొమా

శ్రీకాకుళం(Srikakulam)లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ(Dr. BR Ambedkar University) (బీఆర్‌ఏయూ) - మాస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంహెచ్‌ఏ), పీజీ డిప్లొమా ఇన్‌ మెడికల్‌ రికార్డ్స్‌ అండ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించింది. ఎంహెచ్‌ఏ వ్యవధి రెండేళ్లు. పీజీ డిప్లొమా వ్యవధి ఏడాది. ఒక్కో ప్రోగ్రామ్‌లో 40 సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లకు ఆదిత్య ఎడ్యుకేషనల్‌ సొసైటీకి చెందిన బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ సహకారం అందిస్తోంది. థియరీ తరగతులతోపాటు ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. 


అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌/ బీఎస్సీ/ బీఫార్మసీ/ బీఎస్సీ నర్సింగ్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఎస్సీ/ బీకాం/ బీఏ/ ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


ముఖ్య సమాచారం

క్యాంపస్‌ సెంటర్‌: బొల్లినేని మెడ్‌స్కిల్స్‌, జెమ్స్‌ అండ్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, రాగోలు, శ్రీకాకుళం - 532484

దరఖాస్తు ఫీజు: రూ.250

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: సెప్టెంబరు 24

చిరునామా: డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, డా.బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ, ఎచ్చెర్ల, శ్రీకాకుళం - 532410

వెబ్‌సైట్‌: www.brau.edu.in

Updated Date - 2022-09-21T21:33:24+05:30 IST