డెల్టా వేరియంట్‌పై 96శాతం పనిచేస్తున్న ఫైజర్ టీకా!

ABN , First Publish Date - 2021-06-15T06:12:50+05:30 IST

భారతదేశంలో తొలిసారి బయటపడిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశంలో విజృంభిస్తోంది. దీన్ని నిలువరించడానికి పరిశోధకులు చాలా కృషి చేస్తున్నారు.

డెల్టా వేరియంట్‌పై 96శాతం పనిచేస్తున్న ఫైజర్ టీకా!

లండన్: భారతదేశంలో తొలిసారి బయటపడిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ఇంగ్లండ్ దేశంలో విజృంభిస్తోంది. దీన్ని నిలువరించడానికి పరిశోధకులు చాలా కృషి చేస్తున్నారు. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా డెల్టా వేరియంట్‌పై ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఇదే విషయంలో పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనల్లో రెండు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే డెల్టా వేరియంట్ 96 శాతం అదుపులోకి వస్తుందని, ఈ టీకా రెండు డోసులు తీసుకున్న వారు ఆప్పత్రికి వెళ్లాల్సిన అవసరం 96శాత తగ్గిందని పరిశోధకులు చెప్తున్నారు. ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ 92శాతం పనిచేస్తుందట.

Updated Date - 2021-06-15T06:12:50+05:30 IST