త్వరలోనే భారత్‌తో ఒప్పందం ఖ‌రారు: ఫైజర్‌

ABN , First Publish Date - 2021-06-23T14:19:40+05:30 IST

భారత్‌కు కరోనా వ్యాక్సిన్‌ విక్రయించే ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరాయని అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్‌’ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్ల ప్రకటించారు.

త్వరలోనే భారత్‌తో ఒప్పందం ఖ‌రారు: ఫైజర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 22: భారత్‌కు కరోనా వ్యాక్సిన్‌ విక్రయించే ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరాయని అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్‌’ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్ల ప్రకటించారు. త్వరలోనే భారత ప్రభుత్వంతో ఒప్పందం ఖరారవుతుంది.. తమ టీకాకు అనుమతులు లభిస్తాయనిఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా భారత్‌కు 100 కోట్ల ఫైజర్‌ టీకా డోసులను సరఫరా చేస్తామని వెల్లడించారు. మంగళవారం వర్చువల్‌గా నిర్వహించిన ‘భారత్‌- అమెరికా బయో ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌’ సదస్సులో బౌర్ల మాట్లాడారు. 

Updated Date - 2021-06-23T14:19:40+05:30 IST