భారత్ వేరియంట్లపై కూడా సమర్ధంగా పనిచేస్తున్న ఫైజర్‌, మోడెర్నా!

ABN , First Publish Date - 2021-05-18T19:04:21+05:30 IST

భారత్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం వేరియంట్లు బి.1.617, బి.1.618పై కూడా ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

భారత్ వేరియంట్లపై కూడా సమర్ధంగా పనిచేస్తున్న ఫైజర్‌, మోడెర్నా!

భారత్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం వేరియంట్లు బి.1.617, బి.1.618పై కూడా ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్, లాంగోన్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను చేశారు. 


ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి భారత్‌లో వెలుగులోకి వచ్చిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి పరీక్షించారు. ఈ టీకాలు తీసుకున్న వ్యక్తుల శరీరంలోని యాంటీ బాడీలు ఈ కొత్త వేరియంట్లను కూడా సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు అధ్యయనంలో తేలింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే క్రమంలో ఫైజర్, మోడెర్నా టీకాలు నాలుగు రెట్లు అధిక ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. 

Updated Date - 2021-05-18T19:04:21+05:30 IST