వ్యాక్సిన్‌ అత్యవసర అనుమతులకు..ఫైజర్‌ దరఖాస్తు

ABN , First Publish Date - 2020-11-21T13:31:27+05:30 IST

అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ‘ఫైజర్‌’ మరో ముందడుగు వేసింది. 95 శాతం ప్రభావశీలత కలిగిన తమ కరోనా వ్యాక్సిన్‌

వ్యాక్సిన్‌ అత్యవసర అనుమతులకు..ఫైజర్‌ దరఖాస్తు

వాషింగ్టన్‌,నవంబరు 20: అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ‘ఫైజర్‌’ మరో ముందడుగు వేసింది. 95 శాతం ప్రభావశీలత కలిగిన తమ కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి అనుమతులు కోరుతూ అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు శుక్రవారం దరఖాస్తు చేసింది. దీనికి అనుమతులు మంజూరైన కొన్ని గంటల్లోనే వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసేందుకు సిద్ధమని ఫైజర్‌ ప్రకటించింది. అయితే డిసెంబరు నెల రెండోవారం కల్లా అమెరికా ఎఫ్‌డీఏ, అదే నెల మూడోవారంకల్లా యూరోపియన్‌ యూనియన్‌లు ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

Updated Date - 2020-11-21T13:31:27+05:30 IST