హైదరాబాద్ : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకునే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరమైంది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులు... స్మార్ట్ఫోన్(ఉమాంగ్ యాప్) సాయంతో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చంటూ ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ట్వీట్ చేసింది. కోవిడ్-19 అడ్వాన్స్ రూపంలో డబ్బు మనీ విత్డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. కరోనా నేపధ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న తన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ భారీ ఊరటనిస్తోంది. పీఎఫ్ అకౌంట్ నుంచి రుణాన్నందిస్తోంది. అంతేకాకుండా కోవిడ్ చికిత్స కోసం పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును కూడా మరికొంత సరళీకృతం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి