పీఎఫ్ నిబంధనల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు... ఆ ‘పరిమితి’ దాటితే పన్ను..!

ABN , First Publish Date - 2021-03-01T21:34:53+05:30 IST

ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు నూతన ఆర్ధిక సంవత్సరం(ఏప్రిల్ ఒకటి) నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వివరాలివీ...

పీఎఫ్ నిబంధనల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు... ఆ ‘పరిమితి’ దాటితే పన్ను..!

హైదరాబాద్ : ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు నూతన ఆర్ధిక సంవత్సరం(ఏప్రిల్ ఒకటి) నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వివరాలివీ...

 ప్రావిడెంట్ ఫండ్‌కు ఏడాదిలో రూ.  2.5 లక్షలకు పైన చేసే కాంట్రిబ్యూషన్ ద్వారా లభించే వడ్డీ మొత్తంపై పన్ను పడనుంది.  రూ. 2.5 లక్షల వరకు డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు.


ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాకు జమవుతుందన్న విషయం తెలిసిందే.  అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని సంస్థ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం నేపధ్యంలో... పీఎఫ్ ఖాతాకు ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


ఈ క్రమంలో... ఎక్కువ సంపాదించే వారు, ఎక్కువ డబ్బు కలిగిన వారిపై ప్రభావం పడనుంది. ఏడాదికి రూ. 20.83 లక్షలకు పైబడి సంపాదించే వారు వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై పన్ను కట్టాల్సి ఉంటుంది. కాగా... కొత్త నిబంధన... కేవలం ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌కు మాత్రమే వర్తిస్తుంది. 


కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలుకానుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతా ద్వారా లభించే వడ్డీ మొత్తంపై ఎలాంటి పన్ను లేదు. కేంద్రం తాజా నిర్ణయంతో పన్ను పడుతుంది. ఎక్కువ సంపాదించే వారు, లేదంటే ప్రావిడెంట్ ఫండ్‌ ఖాతాకు ఎక్కువ డబ్బును కాంట్రిబ్యూట్ చేసే వారిపై కొత్త నిబంధనతో ప్రతికూల ప్రభావం పడుతుంది.

Updated Date - 2021-03-01T21:34:53+05:30 IST