మూడు రోజుల్లో 1.14 లక్షల ఈపీఎఫ్‌ క్లైమ్‌ల పరిష్కారం

ABN , First Publish Date - 2022-05-20T06:30:39+05:30 IST

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందజేయడానికి ఈ-గవర్నెన్స్‌ విధానం ద్వారా సంస్కరణలు తీసుకురావడం జరిగిందని రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ - 1 మనోజ్‌కుమార్‌ అన్నారు.

మూడు రోజుల్లో 1.14 లక్షల ఈపీఎఫ్‌  క్లైమ్‌ల పరిష్కారం
రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ - 1 మనోజ్‌కుమార్‌

రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ మనోజ్‌కుమార్‌



రాజమహేంద్రవరం అర్బన్‌, మే 19 : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందజేయడానికి ఈ-గవర్నెన్స్‌ విధానం ద్వారా సంస్కరణలు తీసుకురావడం జరిగిందని రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ - 1 మనోజ్‌కుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరం మోరంపూడిలోని ప్రాంతీయ పీఎఫ్‌ కార్యాలయంలో గురువారం   విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈపీఎఫ్‌వోలో పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రధానంగా యూనిఫైడ్‌ పోర్టల్‌ ద్వారా మెరుగైన సర్వీస్‌ డెలివరీ దరఖాస్తుల పరిష్కారానికి ఆటో సెటిల్‌మెంట్‌ విధానంలో అర్హత ఉన్న క్లైమ్‌లను పరిష్కరించామన్నారు. మొత్తం 1,35,000 క్లెయిమ్‌లు 1,14,000 పైబడి మూడు రోజుల్లోనే పరిష్కారం అయ్యాయని తెలిపారు. దీనికి బహుళ స్థాయి క్లెయిమ్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈకేవైసీ, జన్మదిన తేదీల్లో తప్పుల సవరణ, ఆధార్‌ మార్పులు,చేర్పులు వంటి సులభతరమైన సంస్కరణలు తెచ్చామన్నారు. ఉమాంగ్‌ సర్వీస్‌ పోర్టల్‌ యాప్‌ ద్వారా పెన్షనర్లు వారి పాస్‌బుక్‌ చూసుకునే వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రయాస్‌ పథకం ద్వారా వేగంగా పెన్షన్‌ విడుదల చేసేలా సంస్కర ణలు తీసుకొచ్చామన్నారు. పాక్షిక న్యాయ విచారణకు వర్చువల్‌ హియరింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. మరింత సమగ్ర సమాచారం తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అకౌంట్స్‌ ఆఫీసర్‌ డి..కృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:30:39+05:30 IST