ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు...

ABN , First Publish Date - 2022-01-30T21:27:44+05:30 IST

మొన్రనటివరకు ఎయిరిండియాలో ఉన్న 7,453 మంది ఉద్యోగులకు... భవిఐ్య నిధి, పింఛను, బీమా తదితర ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు వర్తించనున్నాయి.

ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు...

న్యూఢిల్లీ : మొన్నటివరకు ఎయిరిండియాలో ఉన్న 7,453 మంది ఉద్యోగులకు... భవిష్యనిధి, పింఛను, బీమా తదితర ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు వర్తించనున్నాయి. కాగా... డిసెంబరుకు సంబంధించి 7,453 మంది ఉద్యోగుల తరఫున విమానయాన సంస్థ పీఎఫ్ చందా చెల్లించిందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎయిరిండియాను కేంద్ర ప్రభుతవం... టాటా గ్రూపునకు  ఈ నెల 27వ తేదీన అప్పగించిన విషయం తెలిసిందే. ఈపీఎఫ్ఓ వర్తింపు నిమిత్తం ఎయిరిండియా దరఖాస్తు చేసుకోగా, ఇందుకు అనుమతి లభించింది. ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను  కల్పించడంలో భాగంగా ఈపీఎఫ్ఓలో చేరింది.


ఎయిరిండియా. ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం-1952 సెక్షన్1(4) కింద ఎయిరిండియా దరఖాస్తు చేసింది. ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు 2021 డిసెంబరు ఒకటి నుంచే వర్తించేలా అనుమతిస్తూ జనవరి 14 న ఓ అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలియజేశామని సంబంధిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొన్నటివరకు ఈ ఉద్యోగులు పీఎఫ్ చట్టం 1925 పరిధిలో ఉన్నారు. ఉద్యోగి వేతనంలో పది శాతాన్ని యాజమాన్యం తన వాటాగా, మరో పది శాతం ఉద్యోగి, పీఎఫ్ మొత్తంలో జమ అవుతూ వచ్చేది. ఇకపై ఇరువైపులా 12 శాతం జమ కానుంది.  తాజా మార్పు నేపధ్యంలో... ఈపీఎఫ్ పథకం 1952, ఈపీఎస్ 1955, ఈడీఎల్ఐ 1976 ఈ ఉద్యోగులకు వర్తించనున్నాయి. 

Updated Date - 2022-01-30T21:27:44+05:30 IST