పెట్రో ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-19T06:04:55+05:30 IST

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోలు, డీజల్‌ ధరలను తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరలను తగ్గించాలి
మాట్లాడుతున్న పూనాటి ఆంజనేయులు

 వామపక్ష నాయకుల డిమాండ్‌ 

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 18: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోలు, డీజల్‌ ధరలను తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం లీటరు పెట్రోలు రూ.103కు అమ్మడం సిగ్గుచేటన్నారు. వాస్తవంగా లీటరు పెట్రోలు రూ.40కే వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచుకోవడం ద్వారా ఈ ధరలు పెరిగాయన్నారు. ప్రజలపై భారాలు పడకుండా ఉండేందుకు పన్నులను వెంటనే తగ్గిం చాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌డీ సర్దార్‌ మా ట్లాడుతూ పెట్రోలు డీజల్‌ ధరలు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. రోడ్డు ట్రాన్స్‌పోర్టు రంగంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. 

కార్యక్రమానికి సీపీఎం నగర కార్యదర్శి జి.రమేష్‌ అధ్యక్షత వహించగా, జాలా అంజయ్య, జీవీ కొండారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, బి.రఘరాం, బా లకోటయ్య, దామా శ్రీనివాసులు, కంకణాల రమాదేవి, తంబి శ్రీనివాసులు, సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, చంద్రశేఖర్‌, ఎస్‌కే హరికృష్ణ, విజయమ్మ, కారుమూడి నాగేశ్వరరావు, అంజయ్య పాల్గొన్నారు.

చినగంజాం: పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు, మందులపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం పర్చూరు ప్రాంతీయ కమిటీ కన్వీనర్‌ గున్నమనేని ప్రతాప్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు డి.రాఘవులు, జి.యాకోబు, సీహెచ్‌.శ్రీను, కె.జెస్సీ, ఎం.పోలయ్య, సాంబయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారావు పాల్గొన్నారు. 

చీరాల: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో నాయకులు నలతోటి బాబూరావు, వసంతరావు, కొండయ్య పాల్గొన్నారు.

మేదరమెట్ల: పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ సీపీ ఎం ఆధ్వర్యంలో శు క్రవారం మేదరమెట్లలో నిరసన తెలిపారు. పెట్రోధరల పెంపుతో అన్ని వర్గాలపై తీవ్ర భారం పడుతున్నదని, వెంటనే ధరలు తగ్గించాలని సీపీఎం అద్దంకి డివిజన్‌ కార్యదర్శి మోండ్రు ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు కరిముల్లా, సర్దార్‌ఖాన్‌,  రమణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T06:04:55+05:30 IST