పెట్రో ధరలు తగ్గించాలని లారీల రవాణా బంద్‌

ABN , First Publish Date - 2021-02-27T06:54:51+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలన్న డిమాండ్‌తో లారీల రవాణాను బంద్‌చేశారు.

పెట్రో ధరలు తగ్గించాలని లారీల రవాణా బంద్‌

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలన్న డిమాండ్‌తో లారీల రవాణాను బంద్‌చేశారు. ది సెంట్రల్‌ డెల్టా లారీ ఓనర్స్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఈదరపల్లిలోని యూనియన్‌ కార్యాలయం వద్ద నిరసన శిబిరం నిర్వహించారు. యూనియన్‌ అధ్యక్షుడు వాకపల్లి స్వామినాయుడ(పెదకాపు) ఆధ్వర్యంలో లారీల రవాణాను బంద్‌ చేశారు. వేబిల్లుపై  సమయాన్ని పెంపుదల చేయాలని, ఏటా పెంచుతున్న టోల్‌ రేట్లను నిలుపుదల చేయాలని, థర్డ్‌పార్టీ ఇన్సూరెన్సు ప్రీమియం తగ్గించాలని, వాహనాల నుంచి గ్రీన్‌ట్యాక్స్‌ వసూలు చేయాలన్నా నిర్ణయాన్ని విరమించుకోవాలని నినాదాలు చేశారు.  అనంతరం అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన జరిపారు. కొవిడ్‌-19 కారణంగా పదినెలలుగా లారీ యజ మానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలను పెంచడం దారుణమని విమర్శించారు. అనంతరం వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి కురచ పుల్లయ్య, కోశాధికారి బొక్కా శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T06:54:51+05:30 IST