పెట్రోల్ బంకులో బాటిల్‌లో పెట్రోలు ఇవ్వడం లేదని... ఆ కుర్రాడు ఏం చేశాడో చూస్తే తెగ నవ్వుకుంటారు!

ABN , First Publish Date - 2022-08-04T16:29:19+05:30 IST

సాధారణంగా పెట్రోలు బంకులలో ఎవరడిగినా...

పెట్రోల్ బంకులో బాటిల్‌లో పెట్రోలు ఇవ్వడం లేదని... ఆ కుర్రాడు ఏం చేశాడో చూస్తే తెగ నవ్వుకుంటారు!

సాధారణంగా పెట్రోలు బంకులలో ఎవరడిగినా బాటిళ్లలో పెట్రోలు ఇవ్వరు. దీనికి సంబంధించిన నోటీసును కూడా బంకులలో అతికిస్తారు. అయితే ఒక కుర్రాడు తనకు పెట్రోలు చాలా అవసరం కావడంతో విభిన్నరీతిలో పెట్రోల్ పోయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఒక కుర్రాడు సైకిల్‌పై పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంటాడు. అక్కడ బాటిళల్లలో పెట్రోలు ఇవ్వరని రాసివుంటుంది. 


అయితే ఆ కుర్రాడి సైకిల్ క్యారియర్‌కి వాహనానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంకర్ అతికించి ఉంటుంది. దానిలో పెట్రోల్ పోయాలని ఆ కుర్రాడు అక్కడి సిబ్బందిని కోరుతాడు. దానిని చూసిన సిబ్బంది ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ఎక్కడిదో తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను @Raajeev_Chopra అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Updated Date - 2022-08-04T16:29:19+05:30 IST