పెట్రో ధరలపై భగ్గు

ABN , First Publish Date - 2021-10-29T05:16:43+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

పెట్రో ధరలపై భగ్గు
ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 28:  పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బాలాజీచెరువు, మెయిన్‌రోడ్డు, మసీదు సెంటర్‌, గ్లాస్‌ హౌస్‌ సెంటర్‌ మీదుగా దేవాలయం వీధి నుంచి బాలాజీ చెరువు సెంటర్‌కు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎం.కృష్ణమూర్తి, మోర్త రాజశేఖర్‌ మాట్లాడుతూ పెట్రోల్‌ లీటరుపై రూ.36, డీజిల్‌పై 26 పెరిగిందని విమర్శించారు. ధరల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయల భారం మోపుతోందన్నారు. మోదీ ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని విమర్శించారు. క ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కేఎస్‌ శ్రీనివాస్‌, జి.బేబిరాణి, సీహెచ్‌ అజయ్‌కుమార్‌, విజయ్‌ కుమార్‌, టి.నాగేశ్వరరావు, పలివెల వీరబాబు, జుత్తుక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:16:43+05:30 IST