Abn logo
Nov 28 2020 @ 16:56PM

రూ. 82 మార్క్ దాటేసిన లీటర్ పెట్రోలు ధర

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర రూ. 82, డీజిల్ ధర రూ. 72 మార్కును దాటేసింది. గత 9 రోజుల్లో ధరలు పెరగడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. నేడు లీటరు పెట్రోలు 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 82.13కు చేరుకుంది. అలాగే, లీటరు డీజిల్ ధర రూ. 71.86 నుంచి రూ. 72.13కు పెరిగింది. దాదాపు రెండు వారాల తర్వాత ఈ నెల 20న చమురు సంస్థలు ధరలను సవరించాయి. ఈ 9 రోజుల్లో పెట్రోలుపై రూ. 1.07, డీజిల్‌పై రూ. 1.67 పెరిగింది.

Advertisement
Advertisement
Advertisement