పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టిన వాహనదారుడు

ABN , First Publish Date - 2021-06-25T18:45:45+05:30 IST

పెట్రోల్ ధరలు మండుతున్న తరుణంలో ప్రజల్లో లోలోన జ్వాల రగులుతోంది.

పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టిన వాహనదారుడు

పెట్రోల్ ధరలు మండుతున్న తరుణంలో ప్రజల్లో లోలోన జ్వాల రగులుతోంది. దాన్ని కొందరు బయటకు తీవ్రస్థాయిలో ప్రదర్శిస్తున్నారు. ఇదే కోవకు చెందిన ఓ వినియోగదారుడు ఏకంగా పెట్రోల్ బంక్‌కు నిప్పుపెట్టి ప్రభుత్వానికి తన నిరసనను తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు. ఈ దృశ్యం ఎక్కడో తెలియదు కానీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ముందుగా ఓ యువకుడు తన బైక్‌లో పెట్రోల్ పోయించుకోడానికి అన్నట్లుగా బంక్‌లోకి వెళ్లాడు. అక్కడి స్ప్రేయర్‌తో పెట్రోల్‌ను చిమ్మాడు. అడ్డుకోబోయిన సిబ్బందిపై పెట్రోల్ స్ప్రే చేశాడు. వెంటనే బంక్‌కు నిప్పు పెట్టి బైక్‌పై పారిపోయాడు. అప్పటికే అక్కడ పెట్రోల్ పోయించుకుంటున్నవారు ఈ ఘటనను చూసి భయపడి పారిపోయారు. బంక్ సిబ్బంది వెంటనే  అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.

Updated Date - 2021-06-25T18:45:45+05:30 IST