ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత పెట్రో ధరల పెంపు

ABN , First Publish Date - 2022-03-22T14:11:50+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పన్నెండు రోజుల తర్వాత మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి....

ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత పెట్రో ధరల పెంపు

ముంబైలో పెట్రోల్ లీటరు ధర అత్యధికం

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పన్నెండు రోజుల తర్వాత మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ముంబైలో డీజిల్ ధర లీటరుకు రూ. 94.14 నుంచి రూ. 106.62కి పెరిగి మూడు అంకెల మార్కును తాకింది.అంటే డీజిల్ లీటరు ధర లీటరుకు రూ.12 పెరిగింది.పెట్రోలు ధరలు కూడా లీటరుకు రూ.109.98 నుంచి రూ.115.85కి అనూహ్యంగా పెరిగాయి.గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ నవంబర్ 2021 నుంచి ఇంధన ధరలు మారలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా  పెట్రోలు ధరలు పెరుగుతాయని అంచనా వేశారు.


ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.110.82 కాగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.95.00కు పెరిగాయి. కేవలం ఒక్క రోజులో రూ. 6 తేడాతో పెట్రోలు ధర భారీగా పెరిగింది. డీజిల్ ధర కూడా లీటరుకు 5 రూపాయలకు పైగా పెరిగింది.తమిళనాడులోని చెన్నైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ.102.16, రూ.92.19కి పెరిగాయి.విలువ ఆధారిత పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలు,నగరాల్లో కూడా మారుతూ ఉంటాయి.


Updated Date - 2022-03-22T14:11:50+05:30 IST