Abn logo
Aug 24 2021 @ 08:22AM

వాహనదారులకు శుభవార్త: మళ్లీ తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు సంస్థలు ఈరోజు తెల్లవారుజామున వాహనదారులకు శుభవార్త తెలిపాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. గడచిన 38 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇది రెండవసారి. ఇదే సమయంలో పెట్రోల్ ధరలలో పెరుగుదల చోటుచేసుకోలేదు. వారం రోజుల వ్యవధిలో డీజిల్ ధర ఐదుసార్లు తగ్గింది. ఢిల్లీలో ఈరోజు తగ్గిన పెట్రోల్ ధర రూ.101.49 గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.88.92గా ఉంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగడమే కాకుండా, కొంతమేరకు తగ్గుతూ వస్తున్నాయి. 

ఆగస్టు 18 తరువాత డీజిల్ ధర ఐదుసార్లు తగ్గింది. దీనిలో నాలుగుసార్లు లీటరుకు 20 పైసలు చొప్పున తగ్గుతూ వచ్చింది. ఐదవసారి 15 పైసలు తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.


నగరం
పెట్రోల్   
డీజిల్
ఢిల్లీ         
101.49  
88.92
ముంబై 
107.52  
96.48
కోల్‌కతా 
101.82  
91.98
చెన్నై
99.20  
93.52
బెంగళూరు 
104.98  
94.34
భోపాల్ 
109.91  
97.72 
హైదరాబాద్‌ 
105.69 
97.15