పెట్రోలు, డీజలు, గ్యాస్‌ ధరలు ఉపసంహరించాలి

ABN , First Publish Date - 2021-02-27T04:59:42+05:30 IST

సామాన్యుడికి గుదిబండగా మారిన పెట్రోలు, డీజలు, గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని శుక్రవారం ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కడప తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

పెట్రోలు, డీజలు, గ్యాస్‌ ధరలు ఉపసంహరించాలి
తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు

కడప (రవీంద్రనగర్‌), ఫిబ్రవరి 26: సామాన్యుడికి గుదిబండగా మారిన పెట్రోలు, డీజలు, గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని శుక్రవారం ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కడప తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మనోహర్‌ మాట్లాడుతూ పెట్రోలు, డీజలు, గ్యాస్‌ ధరల పెంపు కారణంగా సా మాన్యులపై పెనుభారం పడుతోందన్నారు. తాజాగా సిలిండరుపై మ రో రూ.25 పెంచడం దారుణమన్నారు. ధరల పెంపు ప్రభావం వల్ల ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయని, దీంతో కార్మికులు, సామాన్యుల బతుకు భారంగా మారిందన్నారు. కేరళ, ఒరిస్సా రాష్ట్రాలు సబ్సిడీ భరిస్తూ ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయని, అయితే ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ధరలు తగ్గే విధంగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అందరినీ కలుపుకుని ఢిల్లీకి తీసుకెళ్లి ఉద్యమానికి తోడ్పాటునందించాలన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం అన్యాయమన్నారు. వెంటనే పెట్రో, గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకుని, విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని డిమాం డ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేసీ బాదుల్లా, జిల్లా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు గోవిందు, జాన్‌, నరసింహ, తారకరామారావు, రాజేష్‌, ఆటోవర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నరసింహ, మహబూబ్‌బాషా, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పొరుగు సేవల నాయకులు సుబ్బరాయుడు, సీఐటీయూ నగర నాయకుడు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:59:42+05:30 IST