‘గాలి’కొదిలేశారు..

ABN , First Publish Date - 2021-10-13T04:40:53+05:30 IST

వ్యాపారమే పరమావధి.. సేవల్లో మాత్రం అధమస్థితి.. లైసెన్స్‌ తీసుకొనే సమయంలో వినియోగదారుల సేవలేముఖ్యం.. లాభాపేక్ష చూపబోమని.. నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలుకుతారు.

‘గాలి’కొదిలేశారు..
ప్రీ ఎయిర్‌ మిషన్‌కు పట్టా కప్పిన దృశ్యం

జిల్లాలో ఇష్టారాజ్యంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణ 

బంకుల్లో పనిచేయని ఎయిర్‌ మిషన్లు 

నిబంధనలను పట్టించుకోని యజమానులు

కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 12: వ్యాపారమే పరమావధి.. సేవల్లో మాత్రం అధమస్థితి..  లైసెన్స్‌ తీసుకొనే సమయంలో వినియోగదారుల సేవలేముఖ్యం.. లాభాపేక్ష చూపబోమని.. నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలుకుతారు. తీరా లైసెన్స్‌ చేతిలో పడ్డాకా ‘సేవలా.. అబ్బే ఉత్తుత్తే’ అంటూ దాటవేస్తున్నారు. ఇదీ భద్రాద్రి జిల్లాలో పెట్రోల్‌ బంకుల తీరు.. జిల్లాలో పెట్రోల్‌ బంక్‌ల యజమానులు ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకుకు వచ్చినవారి వాహనాలకు ఉచితంగా గాలి నింపాలనే నిబంధనను తుంగలో తొక్కారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు పెట్రోల్‌, డీజిల్‌ నిమిత్తం బంకులకు వస్తుంటాయి. నిత్యం లక్షల లీటర్ల ఇంధనాన్ని విక్రయిస్తుంటారు. కానీ విని యోగదారులకు అందించాల్సిన సేవల  విషయంలో మా త్రం నిబంధనలను గాలికొదిలారు. కొన్ని బంకుల్లో ఫ్రీ ఎ యిర్‌ మిషన్‌ నడపక పోగా, బంకు ఆవరణలో ప్రవేటు వ్యక్తులతో షెడ్డు పెట్టించి కిరాయి తీసుకుంటూ వ్యాపారం నడుపుతున్నారు. ఇంత జరగుతున్నా సివిల్‌ సప్లయీస్‌ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 67పెట్రోలు బంకుల ఉండగా 90శాతం బంకులలో గాలిమిషన్లు అలం కారప్రాయంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు ప్రైవే టుగా డబ్బులు చెల్లించి తమ వాహనాలకు గాలినింపుకోవాల్సి వస్తోంది. వారికి ఉచితంగా సేవ చేస్తామని లిఖిత పూర్వంగా లైసెన్స్‌ పొందే సమయంలో యజమానులు హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం విస్మరించారు. జిలాల్లో రెండు రిలయన్స్‌ బంకులు ఉన్నాయి. వాటిద్వారా రోజుకు సుమారు 9వేల లీటర్ల పెట్రోల్‌, సుమారు 50వేల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తుంటారు. వారు కొంతకాలం నిబంధనలు పాటించినా గత కొంతకాలంగా పాల్వంచలోని రిలయన్స్‌ బంకులోని గాలి మిషన్‌పై పరదాకప్పిం ఉంచారు. కంప్రెషర్‌ మరమ్మతులకు గురై మిషన్‌ పనిచేయడంలేదని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగూడెం లోని పోస్టాఫీస్‌ సెంటర్‌లోని పెట్రోల్‌బంకులో ఫ్రీ ఎయిర్‌ మిషన్‌ మూలనపడేసి పక్కనే ప్రైవేటు వ్యక్తితో షెడ్డు నడుపుతున్నారు. మరో బంకులో మరమ్మతుల పేరుతో ఆరు నెలలుగా ఫ్రీ ఎయిర్‌ మిషన్‌ ములనపడేశారు. జిల్లా పరిసరా ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మా రుమూల గ్రామాల్లో ఉండే బంకుల పరిస్థితి ఏంటనేది అ ర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సివిల్‌ సప్లయీస్‌ అధికారులు బంక్‌ల నిర్వహణ తీరుపై దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-13T04:40:53+05:30 IST