యాదాద్రి: భూదాన్ పోచంపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో మైక్రో చిప్ ఏర్పాటు చేసి వాహనదారులను బంక్ యాజమాన్యం మోసం చేస్తున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. చిప్ ద్వారా 5 లీటర్ల కు 150ml పెట్రోల్ తక్కువ వచ్చేలా ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. బంకు సీజ్ చేసి నిర్వహకులపై అధికారులు కేసు నమోదు చేశారు.