Abn logo
Jun 19 2021 @ 01:05AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

తాడిపత్రిలో నిరసన తెలియజేస్తున్న సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు

కొనసాగుతున్న వామపక్షాల నిరసనలు


గుంతకల్లు టౌన/, జూన 18: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ, సీపీఎం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద శుక్రవారం ఆపార్టీల నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకుల ధరలు ఆకాశనంటాయన్నారు. రోజు రో జుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలన్నారు. నిరసనలో సీపీఐ పట్టణ కార్యదర్శి వీ రభద్రస్వామి, నాయకులు మక్బుల్‌, ఈశ్వరయ్య,  సురేష్‌, గోపినాథ్‌, చిరంజీవి, సీపీఎం పట్టణ కార్యదర్శి బీ శ్రీనివాసులు, సీఐటీయూ జి ల్లా సహాయ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు, నాయకులు మారుతీప్రసాద్‌, తిమ్మప్ప, జగ్గలి రమేష్‌, సాకే నాగరాజు పాల్గొన్నారు.


తాడిపత్రి : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలంటూ శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని గాంధీసర్కిల్‌లో నిరసనలో పాల్గొన్న సీపీఐ ని యోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి, సీపీఎం పట్టణ, మండల కార్యదర్శులు నరసింహారెడ్డి, జగనమోహనరెడ్డిలు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వా లు ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించా రు. ఆటో, ట్రాక్టర్‌ ఇతర వాహనాల డ్రైవర్లు పెంచిన ధరలతో తీ వ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. నిరసనలో సీఐటీయూ మండల కార్యదర్శి ఉమాగౌడ్‌, కేవీపీఎస్‌ మండల కార్యదర్శి రాంమోహన, ఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి రమణ పాల్గొన్నారు.


ఉరవకొండ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చే స్తూ వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అనంతపురం - గుంతకల్లు రహదారిలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడం తో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆందోళనకారుల వద్దకు ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి వచ్చి ఆందోళన విరమించాలని సూచించారు. నిరసన కారులు ససేమిరా అనడంతో వారిని అరెస్ట్‌ చే సి పోలీస్‌ స్టేషనకు తరలించారు. నిరసనలో నాయకులు రంగా రెడ్డి, జ్ఞానమూర్తి, వన్నూర్‌ సాబ్‌, మల్లికార్జున గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంజినేయులు, అబ్బాస్‌, శీన, ఓబులేశు పాల్గొన్నారు.  


కణేకల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ నాయకులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక రామ్‌ నగర్‌లో వున్న ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకు ముందు సీపీఐ నాగార్జున, బషీర్‌, సర్మస్‌ ఆధ్వర్యంలో అర్దనగ్నంగా బైఠాచించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు దాదాపీర్‌, చందా హుస్సేన, రహంతుల్లా, తిప్పేస్వామి పాల్గొన్నారు. 


గుమ్మఘట్ట :  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండటం పట్ల సీపీఐ రాయదుర్గం డివిజన కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం గుమ్మఘట్ట పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో తిప్పేస్వామి, నాగరాజు, వన్నూరుస్వామి, మల్లికార్జున పాల్గొన్నారు. 


గుత్తి : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఆందోళన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ లాక్‌డౌన కారణంగా సామాన్య ప్రజలు అతికష్టంగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రమేష్‌, నాయకకులు షపీ, రామదాసు, రామకృష్ణ, నరసింహ య్య, వెంకటేశ, రమణ, సూరి పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం : అడూ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు సం జీవప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పట్టణంలో నిరసన చేపట్టారు. స్థానిక టీసర్కిల్‌లో ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్‌, డీజల్‌తో పాటు నిత్యవసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచి ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో నాయకులు అశ్వర్థ, బుడెనసాబ్‌, ఆంజినేయులు, లక్ష్మిదేవి, సునీ ల్‌, నబీ, సర్దార్‌, షఫీ పాల్గొన్నారు. 


కంబదూరు:  అమాంతంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెనువెంటనే తగ్గించి పేదల జీవన స్థితిగతులను చక్కదిద్దాలని సీపీ ఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తిరుపాల్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్తాలను డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానికంగా నిరసన  చేప ట్టారు. పీఎంజీకేఏఏవై స్కీం కింద ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార పప్పు ధాన్యాలను పంపిణీ చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ ఈశ్వరయ్యశెట్టికి అందజేశారు. 


కూడేరు : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని శుక్రవా రం సీపీఐ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల కార్యదర్శి నాయకులు శ్రీరాములు, రమణప్ప, వన్నూరుస్వామి, రమావత చంద్రానాయక్‌, నారాయణప్ప పాల్గొన్నారు.


పామిడి : పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర సరుకులు వంట గ్యాస్‌ను అమాంతం పెంచడంపై సీపీఐ, బీఎస్పీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.