పాలిమర్ల ధరలు పెంచిన పెట్రోకెమికల్స్‌ కంపెనీలు

ABN , First Publish Date - 2021-03-04T06:13:50+05:30 IST

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గెయిల్‌, ఎంఆర్‌పీఎల్‌ వంటి పెట్రో కెమికల్స్‌ కంపెనీలు పాలిమర్ల ధరలను గత 8-10 నెలల్లో 40-155 శాతం వరకూ పెంచాయి

పాలిమర్ల ధరలు పెంచిన పెట్రోకెమికల్స్‌ కంపెనీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గెయిల్‌, ఎంఆర్‌పీఎల్‌ వంటి పెట్రో కెమికల్స్‌ కంపెనీలు పాలిమర్ల ధరలను గత 8-10 నెలల్లో 40-155 శాతం వరకూ పెంచాయి. దీంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వ్యవసాయం, హెల్త్‌కేర్‌, ఫార్మా, ఆటోమొబైల్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర పరిశ్రమలకు ప్లాస్టిక్‌ వస్తువులను సరఫరా చేస్తున్న చిన్న, మధ్య స్థాయి కంపెనీలు పాలీమర్లను కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎందుర్కొంటున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ధర పెరగడంతోపాటు సరుకుకు కొరత సృష్టిస్తున్నారని ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలు తగినంత సరుకును సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.  

Updated Date - 2021-03-04T06:13:50+05:30 IST