పెట్రో ధరల పెంపు, ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-02-27T05:34:22+05:30 IST

పెట్రోలు, డీజి ల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ఽధరల పెంపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో రాజమహేంద్రవరం తాడితోట సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.

పెట్రో ధరల పెంపు, ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల రాస్తారోకో

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 26 : పెట్రోలు, డీజి ల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ఽధరల పెంపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో రాజమహేంద్రవరం తాడితోట సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, టాక్సీ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ధరలు పెంపుతో సామాన్యులపై పెనుభారం పడుతుందన్నారు. పరోక్షంగా నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజల జీవనస్థితిగతులు అస్తవ్యస్తంగా మారతాయన్నారు. తాజాగా గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.25లు పెంచడం దారుణమన్నారు. కొన్ని రాష్ట్రాలు సబ్సిడీ భరిస్తూ ప్రజలకు కాస్త ఊరటనిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతోమంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగే శక్తి ముఖ్యమంత్రి జగన్‌కు ఉందని, ఆయన అందరినీ కలుపుకుని ఢిల్లీకి తీసుకెళ్లి ఉద్యమానికి తోడ్పాటునందించాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా ఉద్యమం నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చలనం లేకపోవడం అన్యాయమన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోకపోతే మార్చి 1వ తేదీన విశాఖవస్తున్న ప్రధాన మంత్రి మోదీకి నిరసన సెగ తప్పదని, గో బ్యాక్‌ మోదీ అంటూ నిరసన కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నల్లా రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, న్యూ డెమోక్రసీ నాయకులు ఏవీ రమణ, కె.జోజి, వివిధ సంఘాల నాయకులు కె.రాంబాబు, నల్లా భ్రమరాంబ, ఎస్‌. రమణమ్మ, యడ్ల లక్ష్మి, పి.వెంకటేశ్వరరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల నాయకులు, పోలీసులకు కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. 

 లారీల బంద్‌ విజయవంతం

అనపర్తి: అనపర్తిలో ది లారీఓనర్స్‌ కల్చరల్‌ అసోసియేషన్‌, అయ్యప్ప నేషనల్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. కల్చరల్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, టోల్‌గేట్‌ ధరలను అదుపు చేయాలని, థర్డ్‌పార్టీ ప్రీమియం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అయ్యప్ప లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి గొలుగూరి దర్మారెడ్డి ఆధ్వర్యంలో యూనియన్‌ కార్యా లయం వద్ద లారీలను నిలుపుదల చేసి ధర్నా నిర్వహించారు.  లారీల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

‘పెట్రో’ ధరలు తగ్గించాలని రాస్తారోకో

ఎటపాక: పెట్రోలు, డీజిలు ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ డివిజన్‌ నాయకు రాలు కందుకూరి శైలజ ఆధ్వర్యంలో కూనవరం-భద్రాచలం రహదారిపై సుమారు గంటకు పైగా రాస్తారోకో చేపట్టారు. సీపీఐ మండల కార్యదర్శి ఎలిశాల నాగ రాజు, పిడియాల దుర్గాప్రసాద్‌, ములిశెట్టి శ్రీను పాల్గొన్నారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం

రంపచోడవరం: నిత్యావసర సరుకులు, గ్యాస్‌, పెట్రో ధరలను నియంత్రిండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ మండలాధ్యక్షుడు అడబాల బాపిరాజు శుక్రవారం ప్రకటనలో ఆరోపించారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి  సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.

పెట్రోధరల పెంపుపై నిరసన

గంగవరం: పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమాన్‌ ఆటో యూనియన్‌ నాయకులు గంగవరం వై.జంక్షన్‌లో నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా నాయకుడు శాంతిరాజు ఆధ్వర్యం లో జరిగిన కార్యక్రమంలో హనుమాన్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు మడకం బాబురావు, ఉపాధ్యక్షుడు రాంబాబు, నాయకులు నాయకుడు కృష్ణ, రమణ, శ్రీను, అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

కూనవరం: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కూనవరం మండల కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. మాజీ ఎంపీపీ కొమరం పెంటయ్య, మేకల నాగేశ్వర రావు, శ్యామలకృష్ణ, సత్యనారాయణ, పాయం సీతారామయ్య, నాగరాజు, శ్రీను, సర్పంచ్‌ మడకం నాగమణి, బొర్రయ్య, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-02-27T05:34:22+05:30 IST