Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రో ధరలు తగ్గించాలి

అజిత్‌సింగ్‌నగర్‌, అక్టోబరు 24: అడ్డగోలుగా పెంచుతున్న పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యాన అజిత్‌సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎస్కే ఖాదర్‌బాషా మాట్లాడారు. కరోనా కష్ట కాలంలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయడం దుర్మార్గమన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు అన్ని వర్గాల ప్రజలకు భారంగా మారాయన్నారు. తక్షణమే కేంద్రం స్పందించి పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తోందని హెచ్చరించారు. ఎస్డీ సలీం, సుభాని, అజాజ్‌, బాజి, ఇంతియాజ్‌, షాహినా పాల్గొన్నారు.


Advertisement
Advertisement