Abn logo
Mar 3 2021 @ 23:55PM

పెట్రో ధరలు తగ్గించాలి

సాలూరు, మార్చి 3 : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ నాయకుడు, ఏఐటీ యూసీ అధ్యక్షుడు సిద్దాబత్తుల రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో సామాన్యులు బతకలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ తదితర నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement