క్రూడాయిల్ ధరలు... ఏడేళ్ల గరిష్టానికి...

ABN , First Publish Date - 2022-01-18T19:56:17+05:30 IST

చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం(జనవరి 18) అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.

క్రూడాయిల్ ధరలు... ఏడేళ్ల గరిష్టానికి...

ముంబై : చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం(జనవరి 18) అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. యెమెన్ హుతి గ్రూప్ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిపిన బాంబు దాడుల్లో... పలువురు మృతి చెందారు. ఈ నేపధ్యంలో సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇరాన్ అలైన్డ్ గ్రూప్-సౌదీ అరేబియన్ నేతృత్వంలోని సంకీర్ణాల మధ్య ఆగ్రహజ్వాలల ప్రభావం చమురు మార్కెట్ పై ప్రతిఫలిస్తుంది. తాజా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ అంతటా కొనసాగుతున్న సంక్లిష్టతను పెంచిందని నిపుణులు చెబుతున్నారు. 


ఏడేళ్ల గరిష్టానికి... 

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్‌కు ఈ రోజు(మంగళవారం) ప్రారంభ సెషన్‌లో 44 సెంట్లు, లేదా 0.5 శాతం లాభపడి, 86.92 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కాగా... 2014 అక్టోబరు 30 న బ్రెంట్ క్రూడ్ 87 వేల డాలర్లను తాకింది. ఆ తర్వాత ఇదే గరిష్టం. అంటే బ్రెంట్ క్రూడ్ ఏడేళ్ల గరిష్టాన్ని తాకింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్‌కు గత శుక్రవారం 81 సెంట్లు, లేదా ఒక శాతం లాభపడి, 84.62 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండు నెలల క్రితం 84.78 డాలర్లను తాకింది. రెండు నెలల గరిష్టానికి సమీపంలో ఉంది. ఉత్పచమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం(జనవరి 18) అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.


డ్రోన్, క్షిపణి దాడుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. యూఏఈ కూడా ఈ ఉగ్రవాద దాడులకు గట్టిగా స్పందిస్తామని తెలిపింది. ఈ దాడి తర్వాత తమ... వినియోగదారులకు ఉత్పత్తి సరఫరాను నిరంతరాయంగా అందించనున్నట్లు యూఏఈ ఆయిల్ కంపెనీ అడ్నాక్ వెల్లడించింది. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థలోని కొన్ని ఉత్పత్తి సంస్థలు తక్కువ పెట్టుబడి, ఇతర అంతరాయాల కారణంగా సరఫరా డిమాండ్‌ను చేరుకోలేకపోవచ్చని భావిస్తున్నారు.


అమెరికా నిర్ణయం...

చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ వైట్‌హౌస్ స్పందించలేదు. సాంకేతిక అంశాల కారణంగా పలు ఒపెక్ దేశాలు తమ అధిక ఉత్పత్తి కోటా కోసం ఇబ్బందులనెదుర్కొంటున్నాయి. వైట్‌హౌస్, ఇతర సంబంధిత దేశాలు నిర్ణయాధికారాల కోసం వేచి చూస్తున్నాయి. స్ట్రాటెజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ నుండి 50 మిలియన్ బ్యారెళ్ల పెట్రో ఉత్పత్తులను విడుదల చేస్తామని, తద్వారా ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తామని అమెరికా అధ్యక్షులు జోబిడెన్ పేర్కొన్నారు. అయితే ఇది స్వల్పకాలిక పరిష్కారం మాత్రమేనన్నది నిపుణుల మాట. వాస్తవానికి గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోన్న ధరలు... ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే... మూడంకెల స్థాయికి  త్వరలో చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-01-18T19:56:17+05:30 IST